ప్చ్.. పంత్ కి ఇలా జరిగింది ఏంటి?

praveen
రిషబ్ పంత్.. ఈ ఆటగాడు గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు  అంతేకాదు టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే  ఒక ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో మొదటి నుంచే అటు రిషబ్ పంత్ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు అంచనాలు అందుకోలేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు  అయితే కొన్నాళ్ళకి ధోని వారసుడిలా కాకుండా ఏకంగా రిషబ్ ను కొత్త ఆటగాడు లాగానే చూడటం మొదలుపెట్టారు భారత్ అభిమానులు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అతను. ఒక్కసారి బ్యాట్ ఝాలిపించాడు అంటే చాలు ఏకంగా బౌలర్లకు సైతం వెన్నులో వెనక పుడుతుంది. భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయాలను ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు రిషబ్ పంత్. అయితే గతంలో రోడ్డు ప్రమాదం బారిన పడిన నేపథ్యంలో.. రిషబ్ పంత్ దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. కానీ ప్రస్తుతం టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు అని చెప్పాలి. కాగా గతంలో రిషబ్ పంత్ కెప్టెన్సీ రేసులో అందరి ఆటగాళ్ల కంటే ముందు ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

 రిషబ్ పంత్ కు కెప్టెన్సీ అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్లు వైస్ కెప్టెన్లను బీసీసీఐ నియమించింది. అయితే రిషబ్ పంత్ ను  మాత్రం ఏ ఫార్మాట్లను కెప్టెన్ గా కానీ వైస్ కెప్టెన్ గా కానీ నియమించకపోవడంతో ఫాన్స్ నిరుత్సాహపడుతున్నారు. బావి భారత కెప్టెన్ గా భావించిన రిషబ్ పంత్ ని కెప్టెన్ గ నియమించకపోవడం నిజంగా బాధాకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. సూర్య, గిల్.. పంత్ ముందు ఎంతో జూనియర్లని.. రిషబ్ పంతును కెప్టెన్సీ నువ్వు పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: