బీసీసీఐలో మరో మార్పు.. NCA కు కొత్త హెడ్.. ఎవరంటే?
బావి కెప్టెన్ అనుకున్న హార్దిక్ పాండ్యాకు కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. అదే సమయంలో ఇక కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం కూడా ముగియడంతో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ను భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ గా నియమించింది. ఇక మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి కోచింగ్ సిబ్బంది ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇకపోతే అటు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు కొత్త చైర్మన్ రాబోతున్నాడు అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు అప్పుడప్పుడు తాత్కాలిక కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు వివిఎస్ లక్ష్మణ్. అయితే మరో రెండు నెలల్లో అతని కాంట్రాక్టు కాలం పూర్తి కాబోతుంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్గా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రాబోతున్నాడు అనేది తెలుస్తుంది. అయితే అతని ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరో రెండు నెలల్లో లక్ష్మణ్ కాంట్రాక్టు పూర్తికానున్న నేపథ్యంలో ఇక ఆ స్థానంలో విక్రమ్ రాథోడ్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తుందట. కాగా మరోసారి ఎన్ సీఏ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ గా ఉండేందుకు వివిఎస్ లక్ష్మణ్ ఆసక్తిని కనబరుస్తున్నారు.