ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. వేలంలోకి రిషబ్ పంత్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కేవలం మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐపీఎల్ ను అమితంగా ఆదరించే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడుతూ ఉండడంతో.. ఈ టోర్నీకి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది ఐపీఎల్.

 అయితే గత కొన్ని సీజన్స్ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్ల విషయంలో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ అభిమానులు అందరినీ కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్ కి ముందు అటు ఛాంపియన్ టీమ్ గా పేరున్న ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని ఇక అటు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇలా కెప్టెన్సీ మార్పు ఆ జట్టుకు అసలు కలిసి రాలేదు. ఇక ఇప్పుడు మరో జట్టు కూడా ఇలాంటి ఒక సంచలన మార్పు చేసేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తోంది.

 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు అంటే రిషబ్ పంత్ అని చెప్పాలి. అయితే రోడ్డు ప్రమాదం బారిన పడి జట్టుకు దూరంగా ఉన్నప్పుడు మరొకరిని కెప్టెన్ గా ప్రకటించినప్పటికీ.. అతను వచ్చిన వెంటనే మళ్ళీ అతనికి సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్  విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం తీసుకోబోతుందట. ఏకంగా అతన్ని వేలానికి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇలా వేలంలోకి వదిలేసి మళ్లీ కొనడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు టాక్. మరోవైపు పంతును దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలోకి రాకముందే ట్రేడింగ్ ద్వారా రిషబ్ పంతును దక్కించుకునేందుకు ఇక ఇప్పటికే చర్చలు కూడా ముగిసాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: