సానియా మీర్జాతో పెళ్లిపై స్పందించిన షమి.. దమ్ముంటే అలా చేయండి అంటూ వార్నింగ్?
ఇక ఇప్పుడు గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ ద్వారా మళ్ళీ షమి రీ ఎంట్రీ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇలా క్రికెట్ ఆడకపోయినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి షమీ మరో విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. అదే రెండో పెళ్లి మ్యాటర్ గురించి.. ఏకంగా భర్తతో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో మహమ్మద్ షమీ రెండో పెళ్లి జరగబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే షమీ కూడా ఇప్పటికే తన భార్య హసిన్ జహాన్ తో విడాకులు తీసుకొని విడిపోయారు.
అయితే ఇలా సానియా మీర్జా, షమీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై సానియా మీర్జా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఆమె తండ్రి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వదంతులు సృష్టించవద్దు అంటూ సోషల్ మీడియా జనాలను కోరాడు. ఇక ఇప్పుడు సానియా మీర్జాతో పెళ్లిపై మహమ్మద్ షమీ కూడా ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను సానియాతో పెళ్లి రూమర్లకు గురించి ఘాటుగానే స్పందించాడు. సానియా మీర్జాతో పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇలాంటి పోస్టులు పెడతారు. దమ్ముంటే నిజమైన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేయండి.. అప్పుడు నేనేంటో చూపిస్తా. ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రాన అంత సర్వనాశనం కాదు. ఇప్పుడు నా కూతురు మా అమ్మతో హ్యాపీగా లైఫ్ ని డిలీట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.