మరో హీరోయిన్ తో పాండ్య రిలేషన్ ?
గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. రెండు రోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. ఇది వారికి చాలా కఠినమైన నిర్ణయమని.... మేమిద్దరం విడిపోయినప్పటికీ మా మూడేళ్ల కుమారుడు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా మేము స్వీకరిస్తామని చెప్పాడు. నాలుగేళ్లు ఇద్దరం కలిసి ఉన్న తర్వాత విడిపోవాలని ఇద్దరం నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడానికి ఓ అమ్మాయి ప్రధాన కారణమని రూమర్స్ వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా సోలంకి అనే యువతితో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ మొన్నటి వరకు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి.
అయితే రీసెంట్ గా పాండ్యా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి హాజరయ్యాడు. ఈ వివాహ వేడుకలో నటి అనన్య పాండేతో డ్యాన్సులు చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనేక రకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రూమర్స్ సోషల్ మీడియాలో చాలా రకాలుగా వైరల్ అవుతున్నాయి.