విడాకుల తర్వాత.. హార్దిక్ మొదటి పోస్ట్.. వైరల్?
కానీ ఊహించని రీతిలో హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏకంగా హార్దిక్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కనీసం హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ హోదాలో కూడా పెట్టకుండా ఒక సాదాసీదా ఆటగాడు గానే జట్టులోకి ఎంపిక చేసింది. దీంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందంటూ అందరూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక హార్దిక్ తన భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు దీంతో ఇలా విడాకుల ద్వారా కెరియర్ పరంగా మాత్రమే కాకుండా పర్సనల్ గా కూడా ఎంతగానో సఫర్ అయిపోతున్నాడు హార్థిక్ పాండ్యా.
అయితే భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. మన శరీరం అలసిపోయినప్పుడు మెదడు అలసిపోతుంది. అలా జరిగినప్పుడు నన్ను పుష్ చేయమని నా శరీరానికి చెబుతాను. అలాంటప్పుడే ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉండేందుకు వీలవుతుంది అంటూ హార్దిక్ పాండ్యా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇది ఒక ఫిట్నెస్ బ్రాండ్ ప్రచారంలో భాగంగా చేసిన వీడియోనే అన్నది అర్థమవుతుంది.