ఆటగాళ్ళను ఇబ్బందికి గురిచేసే యాంటీ సెక్స్ బెడ్స్..?

FARMANULLA SHAIK
పారిస్ ఒలింపిక్స్‌ 2024కు సమయం దగ్గరపడుతోంది. మరో ఐదు రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్‌ జరగనున్నాయి. విశ్వక్రీడలను ఘనంగా నిర్వహించేందుకు పారిస్‌ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే క్రీడాకారుల కోసం ఒలింపిక్ విలేజ్‌లో భిన్న ఏర్పాట్లు చేశారు.ఈ సారి ఒలింపిక్స్ ఆరంభ వేడుక‌ల‌ను కాస్త భిన్నంగా చేయ‌నున్నారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీని సెన్ న‌దిపై నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. ఆరంభ వేడుక‌లు స్టేడియంలో కాకుండా ఆరు బ‌య‌ట న‌దిలో జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కానుంది.ఒలింపిక్స్‌ అంటే క్రీడాగ్రామంలో సౌకర్యాలపై చర్చ మొదలవడం సాధారణం. గతంలోలాగే ఈసారీ అథ్లెట్లకు కేటాయించిన బెడ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత టోక్యో విశ్వక్రీడల్లో కరోనా వైరస్‌ దృష్ట్యా అథ్లెట్లు శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించడం కోసం అట్టలతో (కార్డ్‌బోర్డ్‌తో) చేసిన బెడ్‌లను అథ్లెట్ల గదుల్లో ఉంచారన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, అట్టలతో చేసినా అవి దృఢంగా ఉంటాయనీ.. యాంటీ సెక్స్‌ బెడ్స్‌ మాత్రం కాదని అప్పట్లోనే నిర్వాహకులు వాటిని ఖండించారు. తాజాగా పారి్‌సలోని క్రీడాగ్రామంలో ఇదే తరహా బెడ్‌లు దర్శనమిస్తున్నాయన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం నివాసం క‌ల్పించే ఒలింపిక్ విలేజ్‌లో సైతం భిన్న‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు.


న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, 2024 ఒలింపిక్స్‌కు ముందు యాంటీ సెక్స్ బెడ్స్ పారిస్‌కు చేరుకున్నాయి.పోటీ సమయంలో అథ్లెట్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించడానికి వారి మెటీరియల్, చిన్న పరిమాణం నివేదించబడింది.జపాన్‌లోని టోక్యోలో 2020 ఒలింపిక్ క్రీడల కోసం ఉత్పత్తులను తయారు చేసిన ఎయిర్‌వేవ్ ద్వారా బెడ్‌లు తయారు చేయబడతాయని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.అల్ట్రా-లైట్ కార్డ్‌బోర్డ్ బెడ్‌లను మొదటిసారిగా 2021లో జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2020లో ఉపయోగించారు. అథ్లెట్లు లైంగిక సంపర్కాన్ని నిరోధించడానికి బెడ్‌లు నిర్మిస్తున్నారనే పుకార్లు ఇక్కడే వచ్చాయి.ఈ నేపథ్యంలో ప్రేమ నగరం పారిస్‌లో క్రీడాకారుల కోసం ఏకంగా దాదాపు 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే మరోవైపు నిర్వాహకులు శృంగారాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కౌగిలించుకొని పడుకోవడానికి వీళ్లేకుండా బెడ్ పరిమాణం ఉంచారు. అంతేగాక బెడ్‌లను సెక్స్ నిరోధించే పదార్థాలతో తయారుచేశారట. వీటిని జపనీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ తయారుచేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఈ కంపెనీనే బెడ్‌లు ఏర్పాట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: