ఐపీఎల్: ఆస్ట్రేలియన్ హెడ్ కోచ్‌కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్.. ఇండియన్‌కే ఆ పదవి..?
ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ తమ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌తో వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీమ్‌తో బేలిస్ ఒప్పందం సెప్టెంబర్‌తో ముగియనుంది, అయితే మళ్లీ అతడిని కోచ్ రెన్యూ చేయకూడదని జట్టు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. మరొక ఆస్ట్రేలియన్ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు కోచ్ గా ఉన్నాడు. అయితే అతడిని ఆ టీమ్ వదిలించుకుంది. దాంతో IPL నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు ట్రెవర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది పూర్ కోచింగ్ వల్ల అతడిని టీం పూర్తిగా తీసేయాలని భావించినట్లు వార్తలు వస్తున్నాయి.
పంజాబ్ జట్టు 2025లో జరగబోయే IPL టోర్నమెంట్‌కు ముందు, హెడ్ కోచ్ గా ఒక భారతీయ కోచ్‌ను నియమించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బేలిస్, 2022 IPL ఆటగాళ్ల వేలం జరిగే ముందు పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. అంతకు ముందు ఈ జట్టుకు అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉండేవాడు.
పంజాబ్ కింగ్స్ క్రికెట్ జట్టు తమ ప్రస్తుత కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తొలగించి, ఆ స్థానంలో ఒక భారతీయ కోచ్‌ను నియమించాలని నిర్ణయించుకుంది. ఇటీవల రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిత్, అశిష్ నెహ్రా వంటి భారతీయ కోచ్‌లు ఇతర జట్లకు ఎంతో మంచి చేసిన తర్వాత, పంజాబ్ కింగ్స్ కూడా ఇలాంటి విజయం సాధించాలని అనుకుంటోంది. పంజాబ్ కింగ్స్ క్రికెట్ జట్టు తమ జట్టును మరింత బాగా ఆడించడానికి కొత్త కోచ్‌ను వెతుకుతోంది
ఈ జట్టులో ఇప్పటికే క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ బాంగర్, కొత్త కోచ్‌గా నియమితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంజయ్ బాంగర్ ఇంతకు ముందు 2014 నుంచి 2016 వరకు ఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. చూడాలి మరి ఈ టీమ్ ఏ ఇండియన్ కోచ్ ను తీసుకుంటుందో! మరోవైపు యువరాజు సింగ్ ను గుజరాత్ టైటాన్స్ కాంటాక్ట్ అయినట్టు సమాచారం. రాహుల్ లాంటి అనుభవం మాజీ క్రికెటర్లకు కూడా ఐపీఎల్ లో హెడ్ కోచ్ పదవులు వచ్చే అవకాశం ఉంది.