విడిపోయిన తర్వాత నటాషా ఇన్‌స్టాలో పోస్ట్.. మాజీ భర్త పాండ్యా కామెంట్..??
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా యాక్ట్రెస్ నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లి చేసుకోవడం అయ్యింది, విడిపోవడం కూడా అయిపోయింది. ఈ స్టార్ కపుల్ పెళ్లైన నాలుగేళ్లకే సపరేట్ అయిపోయి షాక్ ఇచ్చారు. ఈ జంట ఎందుకు సపరేట్ అయ్యారో ఎప్పటికీ ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఎవరూ మాట్లాడటం లేదు కానీ జంట విడాకులు తీసుకోకముందే నుంచే నటాషాపై నెటిజెన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదు. అయితే విడిపోయిన తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఒక్క పోస్టుతో స్పష్టం చేసింది నటాషా.
నటాషా జులై 24న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో, కొన్ని చిత్రాలను షేర్ చేసింది. వీటిలో నటి తన కుమారుడు అగస్త్యతో కలిసి కనిపిస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, నటాషా తన కొడుకు అగస్త్యతో క్వాలిటీ టైం గడుపుతూ చాలా సంతోషంగా కనిపించింది. నటాషా తన కొడుకుతో కలిసి ఒక జూకి వెళ్లింది.
నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ చిత్రాలను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. నటాషా పోస్ట్‌పై హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. ఈ భారత క్రికెటర్ ఒకటి కాదు రెండు కామెంట్స్ చేశాడు. ఒక కామెంట్‌లోనేమో లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. మరో కామెంట్‌లోనేమో సూపర్ అని ఒక ఎమోజీ షేర్ చేశాడు.
నటాషా స్టాంకోవిచ్ సెర్బియా దేశం అమ్మాయి. ఈమె డ్యాన్సర్, నటిగా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. పొట్టకూటి కోసమే 2012లో భారత్‌కు వచ్చింది. ఆపై జాన్సన్ & జాన్సన్ బ్రాండ్స్‌కు మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. 2013లో సత్యాగ్రహ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీ బిగ్ బాస్ 8లో కూడా పాటిస్పేట్ చేసింది. అలా లైఫ్ కొనసాగిస్తూ క్రికెటర్ పాండ్యాతో పరిచయం పెంచుకుంది వీళ్లిద్దరూ 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. జులైలో ఒక కొడుకుకు జన్మనిచ్చారు.