ఆ బాధ్యతలు రోహిత్ కే అప్పగించేవాడిని : బుమ్రా

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా మొదటి వరుసలో వినిపించే పేర్లలో అటు భారత స్టార్ ఫేసర్ బుమ్రా పేరు కూడా కాస్త గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరిలాగానే ఒక సాదాసీదా బౌలర్గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు తక్కువ సమయంలోనే తన ఇంపాక్ట్ ను ప్రపంచ క్రికెట్ ఫై చూపించాడు. తన బౌలింగ్ విధానంతో  మహా మహా బ్యాట్స్మెన్ లకు సైతం ముచ్చమటలు పట్టించాడు. ఇక పదునైన యార్కర్లతో ఇక ఎంతోమంది అత్యుత్తమ ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 ఇక టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఏకంగా భారత బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా ప్రస్తుతం బుమ్రా కొనసాగుతూ వున్నాడు అని చెప్పాలి. అంతేకాదు టీమ్ ఇండియాలో బుమ్రాను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక ఎందుకంటే కీలకమైన సమయంలో అద్భుతమైన బంతులు వేస్తూ ఇక టీమిండియాను విజయతీరాలకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక తాను ఎలాంటి బంతి వేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఫీల్డ్ సెట్ చేయాలి అన్న విషయం కూడా బుమ్రాకు బాగా అనుభవం ఉంటుంది.

 కానీ  కొత్తలో టీమిండియాలోకి వచ్చిన సమయంలో తనకు ఫీల్డ్ సెట్ చేయడం కూడా రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు బుమ్రా. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో తనకు పెద్దగా ఏమీ తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఆడటం ప్రారంభించాక.. రోహిత్ శర్మను ఫీల్డ్ సెట్ చేయమని చెప్పేవాడిని.. ఇక తాను ఏ బంతి వేస్తున్నాను. ముందుగానే రోహిత్ కి చెబితే రోహిత్ ఇక అందుకు అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేసేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఎవరిపై ఎక్కువగా ఆధారపడకూడదు అన్న విషయం అర్థమైంది. దీంతో ఇక తానే అన్ని విషయాలు తెలుసుకున్నాను అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: