ఐపీఎల్ 2025 : ఇలా జరిగితేనే.. ధోని ఆడగలడు?

praveen
2019లో మహేంద్ర సింగ్ ధోని అటు అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి కూడా అతని ఐపిఎల్ రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ కూడా తీసుకోబోతున్నాడు అంటూ ఇక ఎన్నో వార్తలు వచ్చిన ధోని మాత్రం ప్రతి ఐపీఎల్ సీజన్ లో కొనసాగుతూనే వచ్చాడు. అంతేకాదు  2024 ఐపీఎల్ సీజన్ కి ముందు మహేంద్రుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ చేతిలో సారాధ్య బాధ్యతలు పెట్టాడు.


 దీంతో 2024 ఐపీఎల్ సీజన్ ధోని కి చివరిది అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఇక ఇలా రిటైర్మెంట్కు సిద్ధమయ్యాడు కాబట్టే చివరికి అటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి కూడా ధోని తప్పుకున్నాడు  అంటూ ఎంతో మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో ధోని ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దూకుడు అయిన బ్యాటింగ్ తో ప్రత్యర్ధులను భయపెట్టించాడు. కాగా ధోని ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటికి స్పష్టత లేకుండా పోయింది. కాగా బీసీసీఐ తీసుకునే నిర్ణయం పైన ధోని ఆడటం ఆడక పోవడం డిసైడ్ అయి ఉంది అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది. దీంతో చాలామంది ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నారు. అయితే ఫ్రాంచైజీలు   ఎంతమందిని రిటైన్ చేసుకోవాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఐదు నుంచి ఆరు మందిని రిటైన్  చేసుకునే అవకాశం కల్పిస్తే వచ్చే సీజన్లో ధోని ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్  యాజమాన్యం రుతురాజ్, రవీంద్ర జడేజా,  పతిరన, శివం దూబేలను రిటైన్ చేసుకుని ఛాన్స్ ఉంది  ఇలాంటి అప్పుడు ఇక ఎక్కువ మందిని టైం చేసుకునే అవకాశం వస్తేనే ధోనీని దక్కించుకునే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. కాగా రేపు ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ సమావేశం కాబోతుంది. ఏకంగా ఐదు నుంచి ఆరు మంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.  ఏం జరగబోతుందో చూడాలి. ఇలా అనుమతిస్తేనే ధోని వచ్చే ఐపిఎల్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: