హమ్మయ్యా.. దిగొచ్చిన టమాటా ధర.. కిలో ఎంతంటే?
ఇక ఇటీవల దేశవ్యాప్తంగా ఏడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఏకంగా మరోసారి టమాటా ధరలు భారీగా పెరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని నెలల వ్యవధిలోనే రెండోసారి సెంచరీ కొట్టేసాయి టమాటా ధరలు. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడిపోయారు. కొంతమంది టమాటా కొనుగోలు చేయాలంటేనే భయపడి చివరికి టమాట లేకుండానే వంటలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇలా పెరిగిన టమాటా ధరలతో బెంబేలెత్తిపోయిన ప్రజలందరికీ ఇక ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది.
మొన్నటి వరకు సెంచరీ కొట్టి ఏకంగా సామాన్యులందరినీ కూడా ఏడిపించిన టమాట ధరలు.. ఇప్పుడు పూర్తిగా తగ్గాయి అన్నది తెలుస్తుంది. ఇలా టమాటా ధరలు ఎట్టకేలకు దిగిరావడం తో సామాన్యులకు కాస్త ఊరట లభించింది అని చెప్పాలి. సంగారెడ్డి,మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట తదితర మార్కెట్లో కిలో టమాటా ధర 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలుకుతుంది. కిలోమిర్చి ఉల్లిగడ్డ బెండకాయ ఆకు కూరలు ధరలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇక వీటిదారులు కూడా తగ్గితే బాగుండు అని సామాన్యులు కోరుకుంటున్నారు.