శ్రీలంక టీమ్ కి మరో బిగ్ షాక్.. ధోని ఫేవరెట్ బౌలర్ దూరం?

praveen
ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. అయితే ఇప్పటికే t20 ఫార్మాట్లో సిరీస్ ను ముగించుకుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ను అటు 3-0 తేడాతో ముగించి వైట్ వాష్ చేసేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక శ్రీలంక జట్టు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా గెలవకుండా సిరీస్ ను చేజార్చుకుని సొంత దేశంలోనే పరువు పోగొట్టుకుంది.

 అయితే భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్  ప్రారంభం కాకముందు నుంచే శ్రీలంక జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలుస్తుంది. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతున్నారు. ఇలా టి20 సిరీస్ కు ముందు పలువురు ప్లేయర్లు దూరం కాగా.. చివరికి ఈ టి20 సిరీస్ లో పెద్దగా రాణించలేక సిరీస్ ను చేజార్చుకుంది శ్రీలంక జట్టు. ఇక రేపటి నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. మరోవైపు టి20 సిరీస్ గెలిచిన దూకుడుతో.. వన్డే సిరీస్ ను ప్రారంభించేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది.

 ఇలాంటి సమయంలో భారత్తో వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. ఆ జట్టు స్టార్ ఫేసర్ పతిరన గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి కూడా దూరమయ్యాడు. ఈ టీమ్ ఇండియాతో జరిగిన చివరి t20 మ్యాచ్ లో ప్రతిరణ భుజానికి గాయమైంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అతను రేపటి నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కి దూరం కాబోతున్నాడట. ఇక అతను స్థానంలో మరో ప్లేయర్ షిరాజ్ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు టి20 సిరీస్ కు మరో ఫేసర్ మధు శంకర్ కూడా దూరమయ్యాడు అని చెప్పాలి. కాగా పతిరన అటు ఐపిఎల్ లో చెన్నై జట్టు లో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: