గంభీర్ మార్క్.. అతన్ని కూడా వదల్లేదుగా?
మొన్నటి వరకు కేవలం బ్యాటింగ్ కి మాత్రమే పరిమితమై ఆకట్టుకున్న ప్లేయర్లు.. ఇక ఇప్పుడు తమలో ఉన్న బౌలింగ్ ప్రతిభను కూడా బయట పెడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న టి20 సిరీస్ లో చివరి మ్యాచ్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేసిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. 360 డిగ్రీస్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసి అదర కొడతాడు అన్న విషయం అందరికి తెలుసు. కానీ సూర్యలో బౌలర్ కూడా దాగి ఉన్నాడు అన్న విషయం ఇక ఆ ఒక్క ఓవర్ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే ఇక కేవలం సూర్య మాత్రమే కాదు పవర్ హిట్టర్ రింకు సింగ్ చేతికి కూడా బంతి అందింది.
అయితే ఇక ఇప్పుడు శ్రీలంకతో బరిలోకి దిగిన వన్డే సిరీస్ లో కూడా ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు గౌతమ్ గంభీర్. ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లో ఏకంగా టీమిండియా ఓపెనర్ గిల్ కూడా బౌలర్ గా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్ వేసిన గిల్ 14 పరుగులు ఇచ్చాడు. ఇలా జట్టులో ఉన్న పదిమంది వికెట్ కీపర్ మినహా ఖచ్చితంగా బ్యాటింగ్ బౌలింగ్ చేయాల్సిందే అనే రూల్ ని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పెట్టాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో జరుగుతున్న మార్పులపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు వస్తూ ఉన్నాయి.