మ్యాచ్ టై అయినా.. సూపర్ ఓవర్ ఎందుకు లేదంటే?
ఇరుజట్లు కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాలలో అద్భుతంగా రాణించాయి. దీంతో ఇక మ్యాచ్ టైగా ముగిసింది అని చెప్పాలి. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ టై గా ముగిసినప్పుడు.. సూపర్ ఓవర్ నిర్వహించడం చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇక సూపర్ ఓవర్ లో ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసిందో చివరికి ఆ టీం ని విజేతగా ప్రకటించడం చూస్తూ ఉంటాం. అంతెందుకు అటు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టి20 సిరీస్ లో చివరి మ్యాచ్ లో కూడా ఇలాగే సూపర్ ఓవర్ నిర్వహించి విజేత నిర్ణయించారు.
అయితే ఇటీవల శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ కూడా నువ్వ నేను అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగి.. టైగా ముగిసింది. ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ నిర్వహిస్తారని అందరూ అనుకుంటుండగా.. అంపైర్లు మాత్రం నిర్వహించలేరు. దీంతో సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదు అనే విషయంపై అందరూ షాక్ లో ఉండిపోయారు. ఐసీసీ రూల్స్ ప్రకారం టి20 మ్యాచ్ టై అయితే కచ్చితంగా సూపర్ ఓవర్ నిర్వహించారు. కానీ వన్డేలో aa రూల్ లేదు. సూపర్ ఓవర్ అనేది ఆట పరిస్థితులు మ్యాచ్ టైమింగ్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వైసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్లో మాత్రమే సూపర్ నిర్వహిస్తున్నారు. అయితే 2020లో జింబాంబే vs పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో ఒకసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. తప్ప ఇప్పటివరకు ఏ వన్డే మ్యాచ్ లో ఇలా సూపర్ ఓవర్ జరగలేదు.