బీసీసీఐతో పెట్టుకుంటే ఇట్టాగే ఉంటుంది మరి.. PCB కి షాక్?
ఈ క్రమంలోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంపై అందరిలో అనుమానాలు నెలకొనగా.. తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే ప్రసక్తే లేదని కావాలంటే టోర్ని నుంచి తప్పుకుంటామని.. ఒకవేళ తాము టోర్నీలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి అంటూ స్పష్టంగా చెప్పేసింది బీసీసీఐ. అయితే గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి వచ్చి తీరాల్సిందే అంటూ మొండిపట్టు పడుతూ ఉంటే.. అటు బీసీసీఐ మాత్రం తాము ఆడబోయే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబట్టింది.
అయితే వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ మొండిగా కూర్చోవడంతో.. చివరికి ఐసీసీ దిగిరాక తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు భారత్కు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పాకిస్థాన్లో పూర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటికీ కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదికలో నిర్వహించేందుకు ఐసిసి బడ్జెట్ ను కేటాయించిందని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకోన్నాళ్లలో బీసీసీఐ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుందట ఐసీసీ. ఇది తెలిసిన టీమ్ ఇండియా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. బీసీసీఐతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.