అతను ఇలా ఆడితే.. టీమిండియాలో చోటు కష్టమే : పాక్ మాజీ
టీమిండియాలో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో.. ఇక అప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లు.. ప్రతి మ్యాచ్లో ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎవరైనా ఆటగాళ్లు విఫలమయ్యారు అంటే చాలు సెలెక్టర్లు కూడా నిర్మొహమాటంగా ఆయా క్రికెటర్లను పక్కకు పెట్టి కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఒక ఆటగాడిని హెచ్చరించాడు.
భారత స్టార్ బ్యాట్స్మెన్ అయిన గిల్ గురించి తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన పాకిస్తాన్ మాజీ సల్మాన్ భట్ అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ రానున్న రోజుల్లో బ్యాటింగ్ మెరుగుపరచుకోకపోతే ఇక వన్డే జట్టులో అతను కొనసాగడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు. గిల్ తరచుగా 20 - 30 లలో అవుట్ అవుతున్నాడని బంతి గాలిలోకి కొట్టి క్యాచ్ అవుట్ గా వెన్ను తిరుగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా వన్ డే ప్రపంచ కప్ తర్వాత దారుణంగా విఫలమవుతున్నాడు. సరైన ఆరంభాలు అందించలేకపోతున్నాడు. అతను ఇలాగే ఆడితే అతని జట్టు నుంచి పక్కన పెట్టడం ఖాయం అంటూ ఈ పాకిస్తాన్ మాజీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.