అందరూ బౌలింగ్ చేయడం సరే.. మరి బ్యాటింగ్ సంగతేంటి?

frame అందరూ బౌలింగ్ చేయడం సరే.. మరి బ్యాటింగ్ సంగతేంటి?

praveen
ఈ మధ్యకాలంలో భారత జట్టులో ఎప్పుడు చూడని విధంగా అనుహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎన్నికైన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి అని అందరూ ఎదురు చూడగా.. ఏకంగా బ్యాట్స్మెన్లు అందరూ కూడా బౌలర్లుగా మారిపోతున్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ల చేతికి గౌతమ్ గంభీర్ బంతిని అందిస్తూ ఉండడంతో అందరూ బౌలింగ్ కూడా చేస్తూ ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తూ ఉన్నారు.

 అయితే భారత జట్టులోని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు కూడా ఇలా బౌలింగ్ చేయడం కారణంగా.. జట్టులో ఆల్ రౌండర్ల సంఖ్య పెరుగుతుందని తద్వారా జట్టు మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే మరింత పటిష్టంగా ఉంటుంది అని అటు గౌతమ్ గంభీర్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ప్లాన్ మంచిదే. కానీ ఎందుకో ఇక గౌతమ్ గంభీర్ వేసిన ప్లాన్ మాత్రం టీమిండియాని దెబ్బ కొడుతుంది. ఎందుకంటే ఇలా బౌలింగ్లో పర్వాలేదు అనిపిస్తున్న స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు.. తమకు అచ్చొచ్చిన బ్యాటింగ్లో మాత్రం తేలిపోతున్నారు అని చెప్పాలి. బలమైన బ్యాటింగ్ కు మారుపేరైన టీమిండియా  శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇక గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఓటమి భారత జట్టు అభిమానులు జీవించుకోలేకపోయారు.

 కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగాల కారణంగానే గెలిచే మ్యాచ్లో కూడా భారత జట్టు ఓడిపోయింది అంటూ విమర్శలు గుప్పించారు అని చెప్పాలి. అయితే ఇలా బలమైన బ్యాటింగ్ కు మారుపేరైన భారత జట్టు శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 231, 241 పరుగులు కూడా చేదించలేకపోయింది. వన్డే ఫార్మాట్లో ఈ టార్గెట్ ఎంత చిన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా రానించలేదు. అయితే ప్రస్తుతం కొత్త కోచ్ గౌతమ్ పేరు బ్యాట్స్మెన్ లతో ఎలా అయితే బౌలింగ్ చేయిస్తూ ఆల్రౌండర్లు ఉండాలని అభిప్రాయపడుతున్నాడో.. ఇక బౌలర్లతోనూ కాస్త బ్యాటింగ్ చేయించి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేలా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: