కెప్టెన్ రోహిత్ ను ఊరిస్తున్న.. మరో అరుదైన రికార్డ్?
అయితే శ్రీలంక పర్యటనలో భాగంగా ఇప్పటికే t20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్ డ్రాగా ముగియగా.. రెండో వన్డే మ్యాచ్లో అటు శ్రీలంక విజయం సాధించింది. కాగా నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత గెలుపోటములతో సంబంధం లేకుండా అటు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం జట్టు విజయం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా అరుదైన రికార్డులు కొడుతూ దూసుకుపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే వన్డే సిరీస్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మను.. ఇక ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తుంది. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో మరో రికార్డుకు చేరువయ్యాడు రోహిత్ శర్మ. మరో రెండు సిక్సర్లు కొట్టాడు అంటే చాలు వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం 331 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండవ స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 330 సిక్సర్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా నేడు జరిగే మూడో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో 351 సిక్సర్లతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.