ఐపీఎల్ ను వదిలి.. SA T20లోకి ఆర్సిబి మాజీ ప్లేయర్?

frame ఐపీఎల్ ను వదిలి.. SA T20లోకి ఆర్సిబి మాజీ ప్లేయర్?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులకు టీమిండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులకు ఫేవరెట్ క్రికెటర్ గా మారిపోయాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతగాడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే మహేంద్ర సింగ్ ధోని జట్టులోకి వచ్చిన తర్వాత టాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ వికెట్ కీపర్ కమ్ దినేష్ కార్తీక్ కి భారత జట్టులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అతను పట్టు విడవని విక్రమార్కుడిలా పోరాడి.. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను కొనసాగిస్తూనే వచ్చాడు అని చెప్పాలి.

 గతంలో ఐపీఎల్ లో అదరగొట్టి ఏకంగా టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్న దినేష్ కార్తీక్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో దినేష్ కార్తీక్ ఆటను చూడలేమేమో అని కొంతమంది అభిమానులు నిరాశలు మునిగిపోయారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో దినేష్ కార్తీక్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి న్యూస్ అందింది. త్వరలో మరోసారి దినేష్ కార్తీక్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగబోతున్నాడు.

 ఒక టి20 లీగ్ లో ఆడబోతున్నాడట. టి20 లీగ్ అనగానే ఐపిఎల్ అనుకుంటున్నారు కదా. కాదు కాదు భారత్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్.. సౌత్ ఆఫ్రికా t20 టోర్నిలో ఆడబోతున్నట్లు ఇటీవల ప్రకటన చేశాడు. పార్లు రాయల్స్ టీం తరఫున ఆయన బరిలోకి దిగబోతున్నాడు అని చెప్పాలి. దీంతో ఈ టోర్నమెంట్లో ఆడబోయే తొలి ఇండియన్ క్రికెటర్ గా దినేష్ కార్తీక్ రికార్డు సృష్టించబోతున్నాడు. అయితే ఇటీవల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్ ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి బ్యాటింగ్ కోచ్ గా నియమించగా మరోవైపు సౌత్ ఆఫ్రికా t20 టోర్నీలో పార్లు రాయల్స్ జట్టు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: