రోహిత్ కు 37 ఏళ్ళు.. అయితేనేం?
ఆయా సీనియర్ ప్లేయర్ల కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్న ప్రతిసారి కూడా.. తమ సత్తా ఏంటో నిరూపిస్తూ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమ్ ఇండియాకు వన్డే టెస్ట్ ఫార్మట్ లలో కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కూడా ఇలాంటి దూకుడైన ఆట తీరుతోనే అందరిని ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. 37 ఏళ్ల వయసులో కూడా యువ ఆటగాళ్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. ఇక భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. తన అద్భుతమైన ఆట తీరుతో తిరుగులేదు అని నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సాధారణంగా రోహిత్ ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
37 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ అసలు ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం లేదని.. అలాంటి ఆటగాడిని ఏకంగా టీమిండియా కెప్టెన్ గా కొనసాగించడం ఏంటి అంటూ కొన్ని కొన్ని సార్లు కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి విమర్శలు అన్నింటికీ కూడా తన ఆట తీరుతోనే సమాధానం చెబుతూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ కూడా తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు లేదు అని ఇక మెరుపు ఇన్నింగ్స్ లతో నిరూపిస్తూ ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండు వన్డే మ్యాచ్లలో కూడా మెరుపు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక వన్డే ఫార్మాట్లో 118. 43 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. 37 ఏళ్ల వయసులో కూడా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. రోహిత్ తర్వాత స్థలంలో 108.65 స్ట్రైక్ రేటుతో గేల్ తర్వాత స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్ 104.23., గిల్ క్రిస్ట్ 101.48, సచిన్ టెండూల్కర్ 93.60 స్ట్రైక్ రేటుతో ఇక వన్డే ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లుగా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.