థర్డ్ అంపైర్ నిద్రమత్తు.. Not out కి బదులు ఔట్ ఇచ్చాడు.. చివరికి?
ఈ మధ్యకాలంలో అయితే అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా ఎన్నో మ్యాచ్లలో ఫలితాలు మారిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి అంపైర్లు చేస్తున్న తప్పిదాలపై ఎంతో మంది సోషల్ మీడియా జనాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ లో కూడా అంపైర్ ఇలాంటి తప్పిదమే చేశాడు. దీంతో సదురు అంపైర్ చేసిన తప్పిదం గురించి తెలిసి అతని ఏమైనా నిద్రమత్తులో ఉన్నాడా ఏంటి అని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇటీవల ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఏకంగా 110 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఓటమిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాగా ఈ మ్యాచ్లో 49 ఓవర్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మహీష్ తీక్షణ ముందుకెళ్లి షాట్ కొట్టిందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయింది దీంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్టంపింగ్ చేశాడు ఇక అప్పటికే తీక్షన బ్యాట్ ను క్రీజు లోపల ఉంచాడు. అయితే దీనిపై రివ్యూ తీసుకోక థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించడంతో శ్రీలంక కోచ్ తో సహా అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత తప్పు గ్రహించిన థర్డ్ అంపైర్ అవుట్ ని నాట్ అవుట్ గా మార్చారు. ఇది చూసి థర్డ్ అంపైర్ ఏమైనా నిద్ర మత్తులో ఉన్నాడా ఏంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు అందరూ .