ప్చ్.. మూడుసార్లు స్పిన్నర్లే ఔట్ చేసారు?

frame ప్చ్.. మూడుసార్లు స్పిన్నర్లే ఔట్ చేసారు?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఎప్పుడు తన ఆటతీరుతో జట్టును ఆదుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో బరిలోకి దిగే విరాట్ కోహ్లీ బౌలర్ల పని పడుతూ ఉంటాడు. అప్పుడు వరకు ఓపెనర్లు మంచి ఆరంభాలు ఇవ్వకపోయినా విరాట్ కోహ్లీ మాత్రం తన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు అంటే చాలు భారత జట్టు తప్పకుండా గెలిచి తీరుతుంది అని అభిమానులు కూడా నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు.

 అలాంటి విరాట్ కోహ్లీ మాత్రం ఇక ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ లలో కూడా కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ ఆట తీరుపై తీవ్రస్థాయిలో అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ వన్డే సిరీస్ లో భారత జట్టు సిరీస్ చేజార్చుకోవడమే కాదు ఒక్క  గెలుపు కూడా లేకుండా దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయితే మూడు మ్యాచ్ లలో కూడా విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.

 మరి ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఎంతగానో ఇబ్బంది పడుతూ కనిపించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్లలో కూడా స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఫేస్ బౌలింగ్ సమర్థవంతంగా ఎదుర్కొన్న విరాట్.. స్పిన్నర్లు వచ్చేసరికి మాత్రం ఇక పరుగులు చేయడంలో నెమ్మదించిపోయాడు. దీంతో ఒత్తిడికి లోనై చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ నెంబర్వన్ బ్యాటర్ ఇలా ఎల్పీడబ్ల్యు అవ్వడం ఆశ్చర్యకరం అని ఎంతో మంది క్రికెట్ నిపుణులు  కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయట్లేదేమో అంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: