సిరాజ్ కు కోట్లు విలువ చేసే ల్యాండ్.. ఎక్కడంటే ?
ఈ సందర్భంగా సిరాజ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి... హైదరాబాద్ లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం సిరాజ్ కు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థలాన్ని వెంటనే గుర్తించాలని.... అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేయడంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ జీవో జారీచేసింది. జూబ్లీహిల్స్ లోని ఇంటి స్థలానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రెవెన్యూ శాఖ. కాగా, టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య కాస్త డల్ అయినట్టు తెలుస్తోంది.
శ్రీలంక అనగానే చెలరేగే మియా ఆ టీమ్ మీద తుస్సుమన్నాడు. లంక సిరీస్ లో మూడు వన్డేల్లో కలిపి అతడు తీసింది మూడు వికెట్లే కావడం గమనార్హం. ఆఖరి వన్డేలో 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు చేయడం, వికేట్లు తీయకపోవడంతో అతడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిరాజ్ కు ఏమైందని అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్ డిసైడర్ లో అర్షదీప్ ను తీసేసి ఏకైక పేసర్ గా సిరాజ్ నువ్వు టీమ్ లోకి తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్. అతడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి బౌలింగ్ అద్భుతంగా చేయమని ఎంకరేజ్ చేశాడు. అయినా కూడా మియా అంచనాలను అందుకోలేకపోయాడు. అతడి ఫెయిల్యూర్ కు పలు కారణాలు కనిపిస్తున్నాయి.