ఫుల్ జోష్‌లో సిరాజ్..ఫ్యామిలీ కోసం కొత్త కారు కొన్న ఫాస్ట్ బౌలర్
తన ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారును కొన్నానని, కలలకు లిమిట్ అనేది ఉండదని, హార్డ్ వర్క్ చేస్తే ఏ కల అయినా సాధ్యం అవుతుందని సిరాజ్ తన నోట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కొన్న కారు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో సిరాజ్ కూడా ఉన్నాడు. ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ టీమిండియాకు రూ.125 కోట్లను ప్రకటించింది. దీంతో అందులో సిరాజ్ వంతుగా రూ.5 కోట్ల వరకూ వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొన్నాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
క్రికెట్ అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతున్న సిరాజ్‌కు తెలంగాణ సర్కార్ ఓ ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల ప్లేస్‌ను సిరాజ్‌కు కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గ్రూప్1 స్థాయి ఉద్యోగాన్ని కూడా సిరాజ్‌కు కేటాయించారు. ఇకపోతే ఇప్పటి వరకూ సిరాజ్ దగ్గర రూ.22 లక్షలు విలువ చేసే టయోటా కొరోల్లా కారు, రూ.40 లక్షల టయోటా ఫార్చునర్, రూ.75 లక్షల బీఎండబ్ల్యూ, రూ.1.86 కోట్ల మెర్సిడెస్ బెంజ్ క్లాస్ కారు, రూ.2.8 కోట్ల రేంజ్ రోవర్ వాగ్యూ కార్లు ఉన్నాయి.