కారు కొన్న సిరాజ్..అతని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

frame కారు కొన్న సిరాజ్..అతని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Veldandi Saikiran
టీమిండియా స్టార్ పెసర్, హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తనకు ఎంతో ఇష్టమైన లగ్జరీ కారు రేంజ్ రోవర్ ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం భారత్ తరపున అన్ని ఫార్మాట్లు ఆడుతున్న సిరాజ్.... శ్రీలంక పర్యటన తర్వాత తనకు దొరికిన కాస్త విరామాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన కుటుంబసభ్యులకు, తనకు ఎంతో ఇష్టమైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.
కాగా.... హైదరాబాద్ లోని ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన మహమ్మద్ సిరాజ్ అసాధారణ, అద్భుతమైన ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో నమ్మదగ్గ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ను గెలిచి భారతజట్టులో సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా భారత తరఫున ఆడాడు.

ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ. 125 కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించింది బీసీసీఐ. ఇందులో సిరాజ్ కు రూ. 5 కోట్లు దక్కాయట. దీంతో ఆ డబ్బులతోనే సిరాజ్ ఈ కారును కొని ఉంటాడని టాక్ వినిపిస్తోంది.  కాగా ఇప్పటికే సిరాజ్ దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ. 2.8 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వాగ్యు, రూ. 1.86 కోట్ల విలువైన మెర్సిడేస్ బెంజ్ క్లాస్ తో పాటు బీఎండబ్ల్యూ 5 సిరీస్, మహీంద్రా థార్ కార్లు ఉన్నాయి. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న సిరాజ్.... ఒక్కో సీజన్ కు రూ. 7 కోట్ల చొప్పున వేతనం అందుకుంటున్నాడు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ లో ఉన్న ఈ పెసర్ కు రూ. 5 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది. మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు అదనంగా వస్తున్నాయి. అంతేకాకుండా యాడ్స్, ఇతర మార్గాల ద్వారా కూడా సిరాజ్ భారీగానే డబ్బులను సంపాదిస్తున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే సిరాజ్ వార్షిక ఆదాయం రూ. 20 కోట్లు. ప్రస్తుతం సిరాజ్ ఆస్తుల విలువ రూ. 74 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: