డబుల్ గోల్డ్ సాధించిన వెస్టిండీస్ క్రికెటర్ కొడుకు.. కుర్రాడి జోరుకు ఒలింపిక్స్ ఫిదా
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్ స్టన్ బెంజమన్ కుమారుడే ఈ రాయ్ బెంజమిన్. విన్ స్టన్ 1987 నుంచి 1995వ ఏడాది వరకూ వెస్టిండీస్ క్రికెటర్‌గా రాణించాడు. పేస్ బౌలర్‌గా 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు. రాయ్ కూడా తన నాన్నలాగానే ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ పరుగులో మాత్రం అతనికి మించి ఎవ్వరూ లేరని కోచ్‌కు తెలిసింది. దీంతో రాయ్‌ను ఫీల్డ్ మళ్లించారు. రన్నింగ్ రేసుల్లో కరీబియన్లకు సాటి ఎవరూ రారు. ఆ శరీరతత్వమే రాయ్‌కు ఉండటం వల్ల ఒలింపిక్స్‌లో దూసుకెళ్లాడు. అతను సాధించిన రెండు స్వర్ణాలు తండ్రి సొంత దేశానికి పెద్ద దెబ్బేనని చెప్పాలి. రాయ్ బెంజమిన్ అమెరికాలో పుట్టాడు. అందుకే అతను అమెరికన్ అయ్యాడు. అలా తను పుట్టిన దేశానికి రెండు స్వర్ణాలు అందించి స్టార్ అయ్యాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో రాయ్ సాధించిన విజయంపై ఆయన తండ్రి విన్ స్టన్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి అనుభూతి తనకు తొలిసారి అని, తన ఆనందం మాటల్లో చెప్పలేనని తెలిపారు. తన కొడుకు సాధించిన విజయం అద్భుతం అని కొనియాడారు. ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించడం సాధారణ విషయం కాదని, అది మాటల్లో చెప్పలేనని అన్నారు. తన కొడుకు రేస్ చూస్తున్నప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ చూసినంత భావోద్వేగం కలిగిందని చెప్పుకొచ్చాడు.