దోనిని అస్సలు క్షమించను.. యువరాజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు వన్డే t20 ఫార్మట్లలో వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా ధోని ఇండియన్ క్రికెట్ అనే పుస్తకంలో ప్రత్యేకమైన పేజీలను లికించుకున్నాడు. అంతేకాదు మిస్టర్ కూల్ కెప్టెన్ గా బెస్ట్ ఫినిషర్ గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 అయితే అందరి క్రికెటర్ లాగా సోషల్ మీడియాలో ధోని పెద్దగా యాక్టివ్గా ఉండడు. కానీ ధోని కి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. ఎవ్వరు ధోని గురించి మాట్లాడిన ఆ విషయం గురించి తెలుసుకునేందుకు భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజు సింగ్ ఇటీవల ధోని గురించి తీవ్ర ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో సంచలనగా మారిపోయింది. ఈ క్రమంలోనే యోగ్ రాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి.

 టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరియర్ ను నాశనం చేశాడని.. నాలుగేళ్ల ఆటను తగ్గించాడు అంటూ యోగ్ రాజ్ ధోనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోని గొప్ప క్రికెటర్.. అందుకు సెల్యూట్ చేస్తా. కానీ నా కుమారుడు విషయంలో అతని తీరును మాత్రం ఎప్పటికీ క్షమించను అంటూ యోగ్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఇక తన కుమారుడు భారత క్రికెట్లో చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించినప్పుడు ధోని, యువరాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం విభేదాలు రావడంతో విడిపోయారు. అయితే ఈ విభేదాలు కారణంగానే ధోని, యువరాజ్ ను కొన్నిసార్లు జట్టు నుంచి తప్పించాడు అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: