చిన్న చీకటిగా ఇరుకుగా ఉన్న గుహలోకి వెళ్లిన వ్యక్తి.. వీడియో చూస్తే వణుకు..?

frame చిన్న చీకటిగా ఇరుకుగా ఉన్న గుహలోకి వెళ్లిన వ్యక్తి.. వీడియో చూస్తే వణుకు..?

praveen

సాధారణంగా మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, అక్కడ ఏం ఉంటుందో అనే భయంతో ఉంటాము. అలాంటి ప్రదేశాల్లో పాములు, ఎలుకలు, ప్రమాదకరమైన పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరూ అలాంటి ప్రదేశాలకు వెళ్ళరు. కానీ, ఓ వ్యక్తి మాత్రం చాలా ధైర్యంగా ప్రమాదకరమైన గుహ లోపలకి వెళ్లాడు. అతనికి సంబంధించి ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి చీకటిగా ఉండే ఒక గుహలోకి చాలా ధైర్యంగా వెళ్లాడు. ఆ గుహలో మోకాలు మునిగేంత నీళ్లు నిండి ఉండటమే కాకుండా, చాలా పెద్ద పురుగులు ఎగురుతున్నాయి. అంతేకాదు, ఆ గుహ చాలా ఇరుకుగా ఉంది.
ఈ వీడియో చూసిన చాలా మందికి ఈ వ్యక్తి చేసిన పని చాలా అనవసరంగా అనిపిస్తోంది. ఎందుకంటే, ఇలాంటి ప్రమాదకరమైన చోట్లకు వెళ్లడం చాలా ప్రమాదకరం. కొంతమంది మాత్రం ఈ వ్యక్తి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఆ గుహ లోపలి గోడలు చాలా గరుకుగా ఉండటంతో పాటు, చుట్టూ ఎగిరే పురుగులు, వినిపించే శబ్దాలు ఎవరికైనా భయం కలిగిస్తాయి. కానీ, ఈ వ్యక్తి మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళకుండా ముందుకు సాగాడు. గుహ అంత దాటేసరికి, నీళ్లు కూడా చివరికి తగ్గుకుంటూ పోయాయి. వీడియో చివర్లో, కెమెరా ఒక చోటు మీద ఫోకస్ చేస్తుంది. అది మురికిలా కనిపించినప్పటికీ, అది సల్ఫర్ డిపాజిట్ అయి ఉండొచ్చు.
https://www.instagram.com/reel/C_RIqaRg2nX/?utm_source=ig_web_copy_link లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.
 ఈ గుహను తాను ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత దాన్ని మూసేసినట్లు ఈ సాహసకుడు తెలిపాడు. ఈ వీడియో చూసిన చాలామంది ఇందులోకి వెళితేనే తమ ఊపిరి ఆగిపోతుందని పేర్కొన్నారు మరి కొంతమంది మెటల్ డిటెక్టర్ పెట్టి అందులో ఏమైనా వస్తువులు దొరుకుతాయో వెతుకుతానని అన్నాడు. ఇలాంటి వాటిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని మరికొంతమంది హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: