కోహ్లీతో టాలీవుడ్‌ హీరోయిన్‌...ఒకే ఫ్లైట్‌ లోనే ?

frame కోహ్లీతో టాలీవుడ్‌ హీరోయిన్‌...ఒకే ఫ్లైట్‌ లోనే ?

Veldandi Saikiran
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి చెన్నై వస్తున్నారు. విరాట్ విమానంలో వస్తున్న సమయంలో తమిళ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కూడా అదే ఫ్లైట్ లో లండన్ నుంచి చెన్నై వస్తున్నారు. వీరిద్దరూ ఫ్లైట్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీతో కలిసి రాధిక సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సెల్ఫీ ఇచ్చినందుకు రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేసింది నటి రాధిక.

ఈ సందర్భంగా విరాట్ పై ఆమె ప్రశంసలు కురిపించారు. "కోట్లాదిమంది హృదయాల్లో నిలిచిన వ్యక్తి కోహ్లీ క్రికెట్ కు కట్టుబడి దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు. అతనితో ట్రావెల్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సెల్ఫీ దిగినందుకు చాలా థాంక్స్"అంటూ రాధిక తన ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొంది. ఇక ఈ నెల 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం శుక్రవారం విరాట్ కోహ్లీ చెన్నైకి చేరుకోవడం జరిగింది. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ ఆడుతున్న సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.

దాదాపు 18 నెలల తర్వాత భారత జట్టు సొంత గడ్డపై టెస్టు సిరీస్ ఆడబోతుంది. గతేడాది మార్చిలో మ్యాచ్ ఆడింది. కోహ్లీ రోహిత్ శర్మలో నేడు జట్టుతో కలిసి ఆడే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ప్రతి టెస్టు మ్యాచ్లో విజయం సాధించడం చాలా కీలకం. ఈ క్రమంలో బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో విజయం సాధించి డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని కోరుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్ గడ్డపై పాక్ ను ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ భారత గడ్డపై అద్భుతాలు సృష్టించాలని ఆరాటపడుతుంది. ఈ క్రమంలో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: