సిక్స్ తో గోడ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

frame సిక్స్ తో గోడ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

Veldandi Saikiran
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థిలకు చుక్కలు చూపించడమే. అలాంటిది సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు దిగాడు. అంతేకాదు ఓ గోడను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుదీర్ఘ ఫార్మాట్ అయినా టెస్ట్ మ్యాచ్లకు రంగం సిద్ధం చేశాడు విరాట్ కోహ్లీ.
ఈ నెల 19వ తేదీ నుంచి బంగ్లాదేశ్ తో.. మొదటి టెస్ట్ ఆడనుంది టీమిండియా. ఈ తరుణంలోనే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు భయంకరమైన బ్యాటింగ్ చేస్తూ... ప్రాక్టీస్ మ్యాచ్ లో స్టేడియం గోడ బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ ల పైన..  కూడా అచ్చం ఇలాగే రెచ్చిపోవాలని విరాట్ ఫాన్స్ అంటున్నారు.

అయితే గొడవ బద్దలు కొట్టిన సంఘటన ఆదివారంచేసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం లండన్ లోనే ఎక్కువగా ఉంటున్న విరాట్ కోహ్లీ... క్రికెట్ మ్యాచ్లు ఉంటేనే ఇండియాకు వస్తున్నాడు. అతి త్వరలోనే లండన్... వారసత్వం కూడా తీసుకోబోతున్నానని విరాట్ కోహ్లీ. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన.. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత శ్రీలంక పైన మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
ప్రతిసారి జీరో కు అవుట్ అయి అందరిని నిరాశపరచాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు... బంగ్లాదేశ్ తో మ్యాచ్లో ఉన్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ తొందరగా ఫామ్ లోకి రావాలని కొంతమంది అంటున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే... టీమిండియాను అడ్డుకునే వాడే ఉండడని... చెబుతున్నారు.  ఇక అటు ఐపీఎల్ టోర్నమెంట్ లో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు...  ఈసారి కూడా విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: