భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?
మొదటి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా ఇప్పటికే సన్నద్ధం కాగా, ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. పటిష్టమైన పాకిస్తాన్ పై విజయోత్సవం తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి పాక్ పై టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. తద్వారా బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగి పర్యాటక జట్టును టీమిండియా పట్టించుకోకపోతే ఓటమి తప్పదు.
అయితే ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే సందేహంలో క్రికెట్ అభిమానుల మధ్య గందరగోళం నెలకొంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సిరీస్ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హిందూ మహాసభ నిరసన సేగలు అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతానికి చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ రెండో టెస్టు వేదిక కాన్పూర్ లో, అలాగే తొలి టీ20 సిరీస్ జరిగే గ్వాలియర్ లో హిందూ మహాసభ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం లండన్ నుంచి విరాట్ కోహ్లీ వచ్చేశాడు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు.