అశ్విన్ సూపర్ సెంచరీ.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?

frame అశ్విన్ సూపర్ సెంచరీ.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?

praveen
రవిచంద్రన్ అశ్విన్.. ఇతను ఒక స్పెషలిస్ట్ బౌలర్.. కాదు కాదు అతను స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్.. అయ్యబాబోయ్ కాదండి అతను సూపర్ ఆల్ రౌండర్. అవును ప్రస్తుతం అశ్విన్ ను ఎలా పిలుచుకోవాలో తెలియక అభిమానులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఎందుకంటే వాస్తవానికి అతను స్పెషలిస్ట్ బౌలర్. ఏకంగా తన స్పిన్ బౌలింగ్ తో ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. వరల్డ్ క్రికెట్లో తనను మించిన స్పిన్ బౌలర్ మరొకరు లేరు అనే రేంజ్ లో రికార్డులు కూడా కొల్లగొట్టాడు.

 కానీ అతను కొన్ని కొన్ని సార్లు బ్యాటింగ్ చేయడం చూస్తూ ఉంటే అందరూ చేతులెత్తేసిన సమయంలో ఇక జట్టు బాధ్యతలను భుజాన వేసుకునే అశ్విన్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉంటాడు. ఇక సాధారణంగా బౌలర్లు అన్నప్పుడు ఇక ఎంత బాగా ఆడిన తక్కువ పరుగులే చేసి అవుట్ అవడం చూస్తూ ఉంటాం. కానీ అశ్విన్ అలా కాదు ఏకంగా సెంచరీల మోత మోగిస్తూ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మెచ్చిన ఆట తీరును కనబరుస్తూ ఉంటాడు. అందుకే ఈ బౌలర్ ని గత కొంతకాలం నుంచి అభిమానులు ఆల్రౌండర్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎన్నోసార్లు తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచిన అశ్విన్.. ఇక ఇప్పుడు మరోసారి ఇదే చేసి చూపించాడు.

 ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుతో అటు టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లుగా కొనసాగుతున్న వారే సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమైతే  అశ్విన్ మరోసారి బ్యాటింగ్ అదరగొట్టేసాడు. ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఈ సూపర్ సెంచరీ తో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు . ఒకే వేదికలో రెండు సెంచరీలు పలుమార్లు 5 ప్లస్ వికెట్లు తీసుకుని ఆటగాళ్ల జాబితాలో చేరాడు అశ్విన్.  చెన్నైలో రెండు సెంచరీలు నాలుగు సార్లు ఐదు వికెట్లు తీశాడు. ఇప్పుడు వరకు సోబర్స్, కపిల్ దేవ్, ఇయాన్ మోర్గాన్ ఈ రికార్డులు సాధించారు. అలాగే నెంబర్ 8 లేదా దిగువన బ్యాటింగ్ చేసి అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: