రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ గా.. టీమిండియా కోచ్.. ఇక దబిడి దిబిడే?

praveen
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది. ఇక ఈ మెగా వేలంలో అన్ని టీమ్స్ కూడా జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరిని వేలంలోకి వదిలేయాలి. కేవలం కొంతమంది ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఐపీఎల్ లో ఉన్న పది టీమ్స్ ఏ ఆటగాళ్ళను రిటైన్ చేసుకుంటాయి.

 ఏ ఆటగాళ్లను వేలంలోకి వదిలేస్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అయితే ఈ మెగా వేలం గురించి ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంచైజీలు  కూడా ప్రస్తుతం ప్రణాళికలను సిద్ధంచేసుకుంటున్నాయ్. కొన్ని టీమ్స్ ఏకంగా కెప్టెన్లను మార్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. మరికొన్ని టీమ్స్ కేవలం జట్టులోని ఆటగాళ్లతో పాటు అటు కోచింగ్ సిబ్బంది లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటున్నయి అని చెప్పాలి. దీంతో గత సీజన్ వరకు ఒక జట్టుకు కోచ్గా ఉన్నవారు. ఇక ఇప్పుడు మరో టీం కోచ్గా వెళ్లిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 ఈ క్రమంలోనే అటు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీం కి కూడా అటూ కొత్త కోచ్ రాబోతున్నాడు అనేది తెలుస్తోంది. ఇటీవలే ఆ ఫ్రాంచైజీ తమ టీం బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ ను నియమించింది. ఆయన ఇటీవలే భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పని చేశాడు. ఇక ఆయన కోచింగ్ లోనే టీమ్ ఇండియా ప్లేయర్లందరూ కూడా దంచి కొట్టి ప్రత్యర్థులకు వణుకు పుట్టించారూ. అయితే ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ గా రావడంతో ఇక ఆ జట్టు ప్లేయర్లు కూడా దబిడి దిబిడే అనే రేంజ్ లో దంచి కొట్టడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ పదవిని కూడా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి  అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరూ తెర వెనుక కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: