టి20 వరల్డ్ కప్ లో టీమిండియాకు అన్యాయం.. మరి ఇంత దారుణమా?

praveen
2024 t20 వరల్డ్ కప్ లో అటు భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా ఘనవిజయాన్ని అందుకొని.. వరల్డ్ కప్ విజేతగా కూడా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నిరీక్షణకు కెప్టెన్ రోహిత్ తెరదించేసాడు. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఇక ఈ వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను ఇప్పటికి కూడా భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేదు.

 అంతలోనే ఇక ఇప్పుడు మరో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. మొన్న పురుష క్రికెటర్లు ఇలా అద్భుతంగా రానుంచి టీమిండియా కు వరల్డ్ కప్ గెలిచి పెడితే.. ఇక ఇప్పుడు మహిళా క్రికెటర్ల వంతు వచ్చింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా ఉమెన్స్ ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరిలో ఆసక్తిని నెలకొంది. ఇలాంటి సమయంలో ఇటీవలే అటు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియాకు ఘోర పరాభవం ఎదురయింది.  అంతేకాదు అంపైర్ చేసిన తప్పిదం అటు టీమ్ ఇండియాకు శాపంగా మారింది. ఒకరకంగా భారత జట్టుకు అన్యాయం జరిగింది.

 ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అమేలీయ కేర్ క్లియర్ రన్ అవుట్ అయ్యింది. కానీ అంపైర్లు మాత్రం నాట్ అవుట్ గా ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు సిబ్బంది కూడా అంపైర్లతో  వాగ్వాదానికి దిగారు. కానీ అంపైర్లు మాత్రం చివరికి దానిని డెడ్ బాల్ గా ప్రకటించారు. కానీ రన్ అవుట్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ రన్ అవుట్ చివరికి వివాదాస్పదంగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో భారత జట్టుకు ఈ మ్యాచ్ లో అన్యాయం జరిగింది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: