వినేశ్‌ ఫొగట్‌ ఘనవిజయం...హర్యానాలో బీజేపీదే అధికారం ?

Veldandi Saikiran
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రెజ్లర్ వినేష్ ఫోగట్.. పడి లేచిన కెరటంలా ఎగిసిపడ్డారు. ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా.. పోరాటం చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్... ఎమ్మెల్యేగా తాజాగా విజయం సాధించారు. హరియాన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు మాజీ రెజ్లర్ వినేష్ పోగట్. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి... లీడింగ్ ప్రదర్శించిన ఈ రెజ్లర్... మధ్యలో అంటే ఐదో రౌండ్ దగ్గర కాస్త వెనుకంజలో పడ్డారు.
 

కానీ ఆరో రౌండు నుంచి 12 రౌండ్ వరకు మళ్లీ లీడింగ్ లోకి వచ్చారు. ఈ తరుణంలోనే తన సమీప ప్రత్యర్థి, బిజెపి పార్టీ నుంచి పోటీ చేసిన యోగేష్ కుమార్ బైరాగిపై... మాజీ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. దాదాపు బిజెపి అభ్యర్థి యోగేష్ బైరాగి పైన 6000 పైచిలుకు ఓట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టారు వినేష్ ఫోగట్. దీంతో వినేష్ ఫోగట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె ఇంట్లో కూడా సంబరాలు ప్రారంభమయ్యాయి.
ఇక... జులాన నియోజకవర్గంలో... మహిళా రెజ్లర్ వినేష్ పోగట్ విజయం సాధించగా... మూడో స్థానంలో సురేందర్ అనే వ్యక్తి నిలిచారు. ఓవరాల్ గా హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా  వీచినప్పటికీ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ గ్రాండ్ విక్టరీ కొట్టడం గమనార్హం. ఎన్నికల కంటే నెలరోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇలా ఎమ్మెల్యేగా గెలవడం రికార్డు అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం నుంచి హర్యానా రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో స్పష్టంగా కనిపించింది.
 

కానీ రెండు గంటలు అయిన తర్వాత అంటే దాదాపు పది గంటల సమయంలో... సీన్ రివర్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ తలకిందులు అయ్యాయి. హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లోకి రావడమే కాకుండా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. హర్యాన రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 49 స్థానాలను ఇప్పటికే దక్కించుకునే దిశగా ముందుకు వెళుతుంది బిజెపి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 మాత్రమే. అంటే ముచ్చటగా మూడోసారి హర్యానాలో బిజెపి పార్టీ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: