2025 ఛాంపియన్స్ ట్రోపీ వేదిక మార్పు... భారత్ మ్యాచ్లు ఎక్కడంటే..!
ఇక ఐసీసీ అయితే హైబ్రీడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ) అయితే ఒప్పుకునేది లేదని చెపుతోంది. భారత్ - పాకిస్తాన్ మధ్య రాజకీయ పరమైన . . ఇతర విబేధాలు ఉన్నా క్రీడలకు వచ్చే సరికి అవేవి ఉండవంటోంది. అయితే పాకిస్తాన్ కు ఓ భయం కూడా వెంటాడుతోంది. భారత్ కనుక ఈ ట్రోఫీకి రాకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవన్న భయం ఆ దేశాన్ని వెంటాడుతోంది.
ఇక గతేడాది జరిగిన ఆసియా కప్ టోర్నీని కూడా భారత్ హైబ్రీడ్ మోడల్ లో అయితేనే ఆడుతుందని పట్టుబట్టడంతో కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్ లో జరిగాయి.. కొన్ని మ్యాచ్ లు శ్రీలంక లో జరిగాయి. ఇప్పుడు కూడా భారత్ మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంక కు మార్చేస్తారని తెలుస్తోంది. భారత్ సెమీస్ కు వెళితే.. అప్పుడు సెమీస్.. ఫైనల్ మ్యాచ్ లను కూడా మార్చక తప్పని పరిస్థితి. మరి దీనికి పాకిస్తాన్ ఎంత వరకు ఒప్పుకుంటుందో ? అసలు ఈ ట్రోఫీ జరుగుతుందా ? లేదా ? అన్నది పెద్ద సస్పెన్సే .