గల్లీ క్రికెట్ లో కూడా ఇలాంటి రూల్స్ ఉండవు.. హాంకాంగ్ టోర్నీలో విచిత్రమైన రూల్స్?
హాంకాంగ్‌లో మాత్రం ఇలాంటి విచిత్రమైన క్రికెట్ రూల్స్ ఉంటాయట. సాధారణంగా 11 మంది ప్లేయర్లు ఒక జట్టు తరఫున ఆడటం చూస్తూ ఉంటాం. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో మాత్రం కేవలం ఒక జట్టులో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారట. అంతేకాదు మ్యాచ్ కూడా 5 ఓవర్లలోనే జరుగుతుందట. ఫైనల్ కు వచ్చేసరికి ఒక్కో జట్టు ఎనిమిది ఓవర్లు ఆడాల్సి ఉంటుందట. అంతేకాదు ఫీల్డింగ్ సైడ్ జటులో ఉన్న ప్లేయర్లలో ఒక్క వికెట్ కీపర్ తప్ప మిగిలిన ప్లేయర్ లందరూ కూడా బౌలింగ్ వేసేందుకు అవకాశం ఉంటుందట. అది కూడా కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే వేయడానికి చాన్స్ ఉంటుందట.
ప్రొఫెషనల్ క్రికెట్లో నోబాల్ లేదా వైట్ బాల్ వేసినప్పుడు కేవలం ఒక పరుగు మాత్రమే ఇస్తారు. కానీ అటు హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో మాత్రం ఏకంగా రెండు పరుగులు ఇస్తారట. అయితే ఐదు ఓవర్లలోపే ఐదు వికెట్లను ఒక జట్టు కోల్పోయిందంటే ఆఖరి బ్యాట్స్‌మెన్ ఇక పార్టనర్ లేకపోయినప్పటికీ కూడా ఆడేందుకు అవకాశం ఉంటుంది. అవుట్ అయిన వారిలో ఎవరో ఒకరు రన్నర్ గా మాత్రమే ఫ్రీజ్ లోకి వస్తారు. ప్రతి బ్యాటర్ 31 పరుగుల వద్దకు రాగానే ఆటోమేటిక్‌గా రిటైర్ నాట్ అవుట్ అవ్వాలి. ఒకవేళ ఆరు సిక్సర్లతో 36 పరుగులు చేసిన కూడా ఇదే జరుగుతుంది.