రోహిత్ భయ్యా.. ఇట్టాగైతే ఎట్టా.. 92 ఏళ్ళ తర్వాత చెత్త రికార్డ్?

praveen
బహుశా ఇలాంటి చెత్త రికార్డు టీమిండియా మునుపెన్నడూ క్రియేట్ చేసి ఉండదేమో అన్నట్టుగా, తాజాగా న్యూజిలాండ్తో జరిగిన ఇన్నింగ్స్ లో నమోదు చేయడం బాధాకరం. దాంతో టీమ్ ఇండియా 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా ఒక చెత్త రికార్డుని నమోదు చేసి, అబాసుపాలయ్యింది. దాంతో క్రికెట్ క్రీడాభిమానులు టీమిండియా పై పెదవి విరుస్తున్నారు.
అవును, సొంత గడ్డపై ఇక తమకు ఎదురు లేదు అనుకున్న టీమిండియా క్రీడాకారులకు న్యూజిలాండ్ టీం షాక్ ఇచ్చింది. ఆడిన మొదటి ఇన్నింగ్స్ లోనే భారత్ న్యూజిలాండ్ బౌలర్లకు బౌన్స్ అయ్యారు. 31 ఓవర్ల వ్యవధిలో భారత్ కేవలం 46 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో టీమిండియా బ్యాట్ మెన్స్ 5 మంది డక్ అవుట్ కావడం బాధాకరం.
ఓపెనర్లు అయినటువంటి రోహిత్‌ శర్మ (2), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్ సౌథీ ఇన్‌స్వింగర్‌ బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) లు కూడా ఆ కివీస్‌ బౌలర్ల ముందు తలవంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ 4 వికెట్లు పడగొట్టగా, సౌథీ ఒక వికెట్‌ తీశాడు.
ఇకపోతే బెంగళూరులో ఎక్కువ వర్షపాతం కారణంగా పిచ్ ఒక్కసారిగా బౌలర్లకు చాలా అనుకూలంగా మారడంతో న్యూజిలాండ్ జట్టుకు బాగా కలిసి వచ్చినట్టు అయింది. దీంతో న్యూజిలాండ్‌ పేసర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులు సంధించారు. ఇక వారి ధాటికి టీమిండియా నిలవలేక చేతులు ఎత్తేసింది. వికెట్‌పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి స్వింగ్ అవ్వడంతో భారత బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. కట్ చేస్తే, కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు టీమిండియా బ్యాట్ మెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: