టెస్ట్ క్రికెట్ హిస్టరీలో.. టీమిండియా సరికొత్త రికార్డు.. అందరినీ దాటేసి?

praveen
అవును, మీరు విన్నది నిజమే. టీమ్ ఇండియా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో జట్టు అందుకోని అరుదైన ఘనతను సాధించి, టెస్ట్ క్రికెట్‌లోనే అరుదైన సంచలన రికార్డ్ నమోదు చేసింది. విషయం ఏమిటంటే, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది మరి. అయితే ఇప్పటి వరకు మరే జట్టు ఈ ఘనతను అందుకోలేక పోవడం గమనార్హం. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా తొలి టెస్ట్‌ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్తోనే భారత జట్టు ఈ 100 సిక్స్ల మార్క్ను చేరుకోగలిగింది.
రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ కోహ్లీ బాదిన భారీ సిక్సర్‌ వలన భారత్ జట్టు 100 సిక్స్‌ల మైలురాయిని సాధించింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లు ఆడిన టీమ్ ఇండియా ఇప్పటి వరకు 102 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఈ జాబితాలో భారత జట్టు తర్వాత ఇంగ్లాండ్ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్లతో మూడో స్థానంలో మళ్లీ భరత్ (2021) ఉండడం కొసమెరుపు. ఇక ఆ తర్వాత నాలుగు ఐదు స్థానాల్లో న్యూజిలాండ్ (2014 - 81, 2013 - 71) నిలిచింది.
ఇకపోతే, ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు భారత జట్టు మొత్తం 5 సిక్స్‌లు కొట్టగా... అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెరొక సిక్స్ బాదగా, సర్ఫరాజ్ ఖాన్ 3 సిక్స్‌లు కొట్టడం విశేషంగానే చెప్పుకోవాలి. కాగా ఈ ఏడాది ముగిసేలోపు టీమ్ ఇండియా ఈ రికార్డ్‌ను మరింత మెరుగు చేసుకోనుంది మరి. కనీసం 150 సిక్స్‌ల మైలురాయిని అందుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దాంతో టీమిండియా అభిమానులు ఇదే విషయం పైన ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: