రిషబ్ పంత్ కు 90 ఫోబియా.. 7 సార్లు ఔట్.. చరిత్రలోనే తొలిసారి ?

frame రిషబ్ పంత్ కు 90 ఫోబియా.. 7 సార్లు ఔట్.. చరిత్రలోనే తొలిసారి ?

Veldandi Saikiran

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో... నాలుగో రోజు టీమిండియా పై చేయి సాధించింది. నాలుగవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా... ఇప్పుడు వందకు పైగా లీడింగ్ లోకి వచ్చి... ఆల్ అవుట్ అయింది. ఐదవ రోజు 107 పరుగులు చేస్తే న్యూజిలాండ్ విజయం సాధించడం ఖాయం.

అయితే టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లో.. రిషబ్ పంత్ చేసిన బ్యాటింగ్ అద్భుతం. ఆయన బ్యాటింగ్ కారణంగా టీమ్ ఇండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అయితే... రెండో ఇన్నింగ్స్ లో.. 99 పరుగుల వద్ద రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. దురదృష్టవశాత్తు... వికెట్ కోల్పోయాడు రిషబ్ పంత్. ఒక పరుగు చేసి ఉంటే సెంచరీ పూర్తి చేసుకునే వాడు.

కానీ చేజేతులా పోగొట్టుకున్నాడు రిషబ్ పంత్. మొదటి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్ లో  99 పరుగులు చేయడం జరిగింది. అయితే ఇలా 90లో రిషబ్ పంత్  అవుట్ కావడం ఇది తొలిసారి ఏం కాదు.  ఇప్పటికే ఆరుసార్లు 90 లో అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. న్యూజి లాండ్ మ్యాచ్ లో ఏడవ సారి. సచిన్ టెండూల్కర్ కూడా 90లో చాలా సార్లు అవుట్ అయ్యాడు.

దాదాపు పదిసార్లు. సచిన్ టెండూల్కర్ 90 లోనే అవుట్ అయ్యాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బద్దలు కొట్టేలా రిషబ్ పంత్ ఏకంగా ఏడుసార్లు అలా అవుతాడు.  ఇక 99 వద్ద అవుటయినా ప్లేయర్లలో వారిలో రిషబ్ పంత్ ఐదోవాడు. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని, మురళి విజయ్, సౌరవ్ గంగూలీ , వీరేంద్ర సెహ్వాగ్  లు ఉన్నారు. ఇప్పుడు వారి లిస్టులోకి రిషబ్ పంత్ కూడా చేరి పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: