'లడ్డు ముత్య' స్వామిల మారిన శిఖర్ ధావన్.. దేన్ని వదలడుగా?

frame 'లడ్డు ముత్య' స్వామిల మారిన శిఖర్ ధావన్.. దేన్ని వదలడుగా?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక భారత జట్టు తరఫున ఆడిన స్టార్ ప్లేయర్స్ గురించి ఏ విషయం మాట్లాడాలన్న ఆయా క్రికెటర్ల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అందుకే ఆయా క్రికెటర్ల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది క్రికెటర్లు  ఆటలో తాము తోపులం అని నిరూపించుకోవడమే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కోట్లాదిమంది అభిమానులకు హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు.

 అలాంటి వారిలో టీమిండియా మాజీ  ప్లేయర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత జట్టుకు ఓపెనర్ గా సేవలు అందించాడు శిఖర్ ధావన్. తన అద్భుతమైన ఆట తీరుతో గబ్బర్ అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. ఒకానొక సమయంలో అతను బ్యాటింగ్ కి వస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. ఆ రేంజ్ లో విద్వంశం సృష్టించాడు. కానీ గత కొంతకాలం నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో చివరికి టీమిండియా కు దూరమయ్యాడు.

 అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ పై వీడియోలు చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు శిఖర్ ధావన్. కాగా ఈ మధ్యకాలంలో లడ్డు ముత్య బాబా అంటూ ఒక వీడియో తెగ వైరల్ గా మారిపోయింది. ఏకంగా తిరుగుతున్న ఫ్యాన్ చేతితో ఆపేసి ఇక తన కుర్చీని ఎత్తుకున్న వారికి బొట్టు పెట్టడం ఈ రీల్ లో చూడవచ్చు. అయితే ఇటీవల అటు స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా లడ్డు ముత్య బాబాగా మారిపోయాడు. ఇద్దరు వ్యక్తులు కుర్చీలో కూర్చున్న శిఖర్ ధావన్ ను ఎత్తుకుంటే.. తిరుగుతున్న ఫ్యాన్ ని చేతితో ఆపేస్తాడు దావన్. ఇక ఆ తర్వాత అక్కడున్న నలుగురికి బొట్టు పెట్టేస్తాడు. దీంతో ఇది చూసి ఫ్యాన్స్ అందరు తెగ నవ్వుకుంటున్నారు. ధావన్ దేన్నీ వదలడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: