ప్చ్.. జట్టు నుండి ముగ్గురిని పీకేసిన రోహిత్?

praveen

ఎన్నో అంచనాల నడుమ మొదలైన మొదటి టెస్టులోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన భారత్ మరో టెస్టుకు ఇపుడు రెడీ అయింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా జరగబోతున్న రెండో టెస్టు ఇవాళ నుంచి జరగనుంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకున్న సంగతి విదితమే. అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని బాగానే పోరాడింది అని చెప్పుకోవచ్చు. అయినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. టెస్టు సిరీస్‌ను నిలుపుకోవాలంటే రెండో టెస్టు‌లో టీమిండియా ఇపుడు తప్పక సత్తాచాటాల్సిన పరిస్థితి.
ఇపుడు భరత్ కివీస్‌ను చిత్తు చిత్తు కింద ఓడించాలనే అత్యవసరం ఏర్పడింది. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది అని చెప్పుకోవడంతో అతిశయోక్తి లేదు. 2012 నుంచి స్వదేశంలో భారత్ ఒక్క టెస్టు సిరీస్‌ను కోల్పోకుండా 18 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించింది. మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. గత టెస్టు ఆడిన పిచ్ కంటే ఇది భిన్నంగా ఉందని, తొలి టెస్టులో గెలిచిన జోరును కొనసాగించడానికి ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. ఇక గాయం కారణంగా మ్యాట్ హెన్నీ జట్టుకు దూరమయ్యాడని, అతని స్థానంలో మిచెల్ శాంట్నర్ వచ్చాడని తెలిపాడు.
ఆ తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో మార్పులు గురించి చెప్పుకొచ్చాడు. మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్ దూరమయ్యారని, వాళ్ల స్థానంలో ఆకాశ్ దీప్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్‌ తుదిజట్టులోకి వచ్చారని రోహిత్ చెప్పాడు.
ఇక భారత్ జట్టు వివరాలకొస్తే... రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్). ఇక న్యూజిలాండ్ జట్టు వివరాలకొస్తే... టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి, అజాజ్ పటేల్, విలియమ్ ఒరుర్కే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: