వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ కి.. సారధిగా ఇంత చెత్త రికార్డా?
రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్‌లు అంతగా పరుగులు చేయలేకపోయారు. ఇదే భారత జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఈ ఓటములతో కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఒక చెత్త రికార్డు నమోదైంది. అదేంటంటే, సొంత గడ్డపై అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయిన ఇండియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరస్ట్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ కెప్టెన్ల లిస్ట్ లో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ కంటే ముందంజలో ఉన్నాడు.
2000 సంవత్సరం తర్వాత భారత్‌లో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ఎక్కువ సార్లు ఓడిపోయింది. ఇంతకు ముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, గంగూలీ పేర్లపై ఉండేది. కానీ, ఇప్పుడు రోహిత్ శర్మ ఈ ఇద్దరినీ మించిపోయాడు. క్రికెటర్ రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియా హోమ్ గ్రౌండ్ లో టోటల్‌గా 15 మ్యాచ్‌లు సొంత గడ్డపై ఆడగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. అదే విధంగా గంగూలీ 21 మ్యాచ్‌లు ఆడినప్పుడు 3 మ్యాచ్‌లు, మహేంద్ర సింగ్ ధోనీ 30 మ్యాచ్‌లు ఆడినప్పుడు 3 మ్యాచ్‌లు ఓడిపోయారు. సచిన్ టెండూల్కర్ 2 మ్యాచ్‌లు, రాహుల్ ద్రవిడ్ 8 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 31 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, వీరందరూ రోహిత్ శర్మ కంటే తక్కువ మ్యాచ్‌ల్లోనే మాత్రమే ఓడిపోయారు. కెప్టెన్సీ వారి చేతిలో ఉన్నప్పుడు హోమ్ గ్రౌండ్ లో ఓటమి కాకుండా కాపాడుకున్నారు కానీ రోహిత్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు.