సో క్యూట్.. కుమారుడి ఒడిలో నిద్రించిన హార్దిక్ పాండ్యా.. ఫ్యాన్స్ ఫిదా?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా ఆ అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. అందుకే ఎవరైనా ఆటగాడు ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టి కాస్త గుర్తింపును సంపాదించుకున్నాడు అంటే చాలు ఇక దేశం మొత్తం అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అతను అందరికీ సుపరిచితుడుగా మారిపోతూ ఉంటాడు.

 అంతేకాదు ఇక ఆ ప్లేయర్ స్టార్ ప్లేయర్గా ఎదిగితే అతని గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి విషయం ఏదైనా తెరమీదికి వస్తే అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్  తెర మీదికి వచ్చింది. పాండ్యా నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక నటాషా తన కొడుకు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్ళి పోయింది.

 దీంతో హార్దిక్ పాండ్యా కూడా ఎంతగానో ఫీల్ అయ్యాడు. కాగా ఇప్పుడు హార్దిక్ కొడుకు అగస్త్య తండ్రి వద్దకు చేరాడు. తన వదిన క్రుణాల్ పాండ్యా భార్య పాన్కూరి దగ్గర ఉంటున్నాడు అగస్త్య. అయితే ఇటీవల హార్దిక్ పాండ్యా తన కొడుకు ఒడిలో తలపెట్టి హాయిగా నిద్రపోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. అయితే ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ కూడా తెగ మురిసి పోతున్నారు. ఇక ఇది చూస్తూ క్యూటెస్ట్ ఫోటో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. హార్థిక్ పాండ్యాకు కొడుకే ప్రపంచం అన్న విషయం ఈ ఒక్క ఫోటోతో అర్ధమైపోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: