అనుకున్నదొక్కటి అవుతుందొక్కటి.. రోహిత్ - గంభీర్ కాంబోపై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

praveen
ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు పూర్తిగా చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లు మిచెల్ శాంటనర్, గ్లెన్ ఫిలిప్స్ భారత బ్యాట్స్‌మెన్‌లకు ఎంతమాత్రం స్కోర్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితి చూసి కోపంతో ఉన్న క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో భారత బ్యాటింగ్ వ్యూహం, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ కాంబో వ్యూహాన్ని దారుణంగా విమర్శించారు. 24 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ కాంబో ఓడిపోయింది. వీరిద్దరూ కలిసి భారత క్రికెట్‌కు కొత్త శకం తెస్తారని అనుకున్న అభిమానుల ఆశలు అడియాసలు అయ్యాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్‌లో కొత్త శకం వస్తుందని అనుకున్నారు కానీ టీమ్ ఇండియా పరిస్థితి అనుకున్నదొకటి అయినదొకటి లాగా తయారయ్యింది. ఇప్పుడు వరుస ఓటములతో జట్టు భవిష్యత్తు గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు.
భారత్ సొంత గడ్డలో టెస్టు క్రికెట్‌లో ఎప్పుడూ గెలిచే జట్టుగా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బలహీనమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2017లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కూడా చేయలేని విషయాన్ని టామ్ లాథం నేతృత్వంలోని న్యూజిలాండ్ చేసింది. తమ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ లేకపోయినా, కివిస్ భారత జట్టును ఓడించింది.
అందుకే క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ఇద్దరి కాంబో, వారి ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. "రోహిత్-గంభీర్ కాంబో అద్భుతాలు చేస్తున్నారు" అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే సొంత మైదానంలో స్పిన్ బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్‌లు తట్టుకోలేకపోతున్నారు. న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయాక టీమిండియా ఇప్పుడు ఫైనల్ కి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మొత్తం 6 దాకా మ్యాచ్లు మిగిలి ఉండగా వాటిలో కనీసం రెండు మ్యాచులు గెలవాలి మరో నాలుగు మ్యాచ్ డ్రా కావాల్సి ఉంది. గెలిస్తేనే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం సాధ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: