క్రికెట్ ప్రపంచంలో ఉనికిని చాటుకుంటున్న ఆప్ఘనిస్థాన్!
ఇక 2023 నుండే ఆప్ఘనిస్థాన్ తన అద్భుతమైన క్రికెట్ ఆటతీరుని మెరుగుపరుంచుకుంటూ వస్తోందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండే, ఈ ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలను నమోదు చేయడం ఆరంభించింది. మొదట సరిగా ప్రపంచకప్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి ఇంగ్లాండ్ ని మట్టికరిపించి సంచలన విషయం నమోదు చేసింది. ఇంకా ఆ సెన్సేషన్ విజయం గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే వరల్డ్ క్లాసింగ్ బౌలింగ్, టాప్ బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్ జట్టును కూడా చిత్తు చిత్తు కింద ఓడించింది. జట్టులో ఎంతో కసి ఉంటే కానీ ఇలాంటి విజయాలు నమోదు కావనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే, ఆప్ఘనిస్థాన్ కసి వెనక ఎన్నో కన్నీళ్ల గాథలు ఉన్నాయని మీకు తెలుసా? గత కొన్నేళ్లుగా అఫ్గాన్ జట్టు ప్రదర్శన చూస్తున్న వారికి.. ఇవేవో అనుకోకుండా వచ్చిన విజయాల్లా అస్సలు అనిపించవు. ఎందుకంటే ఆ దేశ ప్లేయర్స్ సరిగ్గా సంవత్సరకాలం కిందట ఎలాంటి స్థితిలో వరల్డ్ కప్లో అడుగు పెట్టారో తెలిస్తే, జేజేలు కొట్టక మానరు. కొన్నాళ్ల క్రితం అఫ్గాన్లో భూకంపం(2023) కుదిపేయడంతో ఏకంగా 3 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అంతకుముందు రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి ఆ దేశం వెళ్లిపోవడం వల్ల.. అత్యంత దయనీయంగా మారిపోయింది. కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఆ దేశం బాగా చితికిపోయింది. అలాంటి కష్టాల్లోకూడా బాధను దిగమింగుకుని.. గుండె నిబ్బరంతో... ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉండటం మొదలుపెట్టారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలోనే ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా అఫ్గానిస్థాన్ జట్టు అవతరించడం చాలా గొప్పవిషయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.