గంభీర్ స్థానంలో కొత్త కోచ్.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం?

praveen
సాదరణంగా ఒక జట్టు ప్రదర్శన ఎలా ఉంది అనే విషయం ఇక ఆ జట్టు కోచ్ ఎలా ఉన్నాడు అనే విషయాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. కోచ్ మెలుకువలతోనే ఆటగాళ్లు మైదానంలోకి రాణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎన్నో అంచనాల మధ్య టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టిన గంభీర్ మాత్రం ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యర్థులపై పైచేయి సాధించి అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా.. ఇక ఇప్పుడు మాత్రం చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొంటుంది.

 టీమిండియా లో ఎన్నో అనవసర ప్రయోగాలు చేస్తూ చివరికి గంభీర్ కూడా విమర్శల పాలు అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమిని అయితే భారత జట్టు అభిమానులు ఎవరు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే హెడ్ కోచ్ గంభీర్ స్థానంలో కొత్తవారికి బాధ్యతలు బిసిసిఐ అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజమే గంభీర్ స్థానంలో కొత్త కోచ్ రాబోతున్నాడు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత కోచింగ్ బాధ్యతలను వివిఎస్ లక్ష్మణ్ అందుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 అయితే ఇది పూర్తిస్థాయి హెడ్ కోచ్ గా కాదు. కేవలం తాత్కాలిక కోచ్గా మాత్రమే. ఆస్ట్రేలియా పర్యటనతో ప్రధాన కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ బిజీగా ఉండనున్న నేపథ్యం లో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందట. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా తో జరగనున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్ పదవ తేదీన బయలుదేర బోతుంది. ఇంకోవైపు దక్షిణాఫ్రికా తో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా తో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో నాలుగు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: