ఎవరిని తీసుకోవాలో మాకు తెలుసు.. పంత్ ను వదులుకోవడంపై.. ఢిల్లీ ఓనర్ ఘాటు వ్యాఖ్యలు?

frame ఎవరిని తీసుకోవాలో మాకు తెలుసు.. పంత్ ను వదులుకోవడంపై.. ఢిల్లీ ఓనర్ ఘాటు వ్యాఖ్యలు?

praveen
ఐపీఎల్ మొదలైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండుగ మొదలవుతూ ఉంటుంది. సాధారణంగా ఏ పండుగ వచ్చినా ఒకటి రెండు రోజులు మాత్రమే హడావిడి ఉంటుంది. కానీ ఐపీఎల్ అనే పండుగ మొదలైతే నెలన్నర రోజులు పాటు క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ప్రతిరోజు పండగే. అంతలా ఈ టోర్ని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రతి సీజన్ కూడా అంతకంతకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఇక బ్రాండ్ వ్యాల్యూను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఐపీఎల్ లో మొత్తంగా 10 జట్లు పాల్గొంటూ ఉంటాయి. కాగా ఇక వేలం వచ్చిన ప్రతిసారి కూడా ఆయా జట్టు యాజమాన్యాలు కొంతమంది ఆటగాల్లను వేలంలోకి వదిలేయడం.. ఇంకొంతమందిని జట్టులోకి తీసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ వేలం విషయంలో ఆయా జట్ల అభిమానులకు కూడా ఒక అంచనా ఉంటుంది. ఎవరిని వేలంలోకి వదిలేస్తారు.. ఎవరిని రిటైన్ చేసుకుంటారు అనే విషయాన్ని ముందుగానే అంచనా వేస్తారు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీల వ్యూహాలను అభిమానులు సైతం ముందుగా అంచనా వేయలేకపోతున్నారు.

 ఎందుకంటే ఏ టీం ఎప్పుడు ఎవరిని వదులుకుంటుంది అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇలాగే చేసింది. ఏకంగా ఆ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంతును అంతేకాదు కోచ్గా కొనసాగిన రికీ పాంటింగ్ కూడా వదిలేసుకుంది. పంత్ ను వదిలేయడమేంటి అని జట్టు అభిమానులు సైతం షాక్ అయిపోయారు. ఇలా ఎందుకు చేశారు అంటూ ఫ్రాంచైజీని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆ జట్టు కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్,  స్టబ్స్, పారెల్ ను రిటైన్ చేసుకున్నాం. ఇందులో హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు ఆర్టీఎంలు ఉన్నాయి  గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించే అవకాశం ఉంది. అయితే వేలంలో ఏం చేయాలి అనే విషయంపై కసరత్తు చేస్తున్నాం అంటూ ఘాటుగానే స్పందించాడు. ఒకరకంగా రిషబ్ పంత్ ను వేలం లోకి వదిలేయడం పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు పార్థ్ జిందాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: