తెలుగు క్రికెటర్లకు గుడ్ న్యూస్.. IPL తరహాలో మరో లీగ్?
ఈ క్రమంలోనే ఐపీఎల్లో బాగా రాణించిన ప్లేయర్లకు అటు టీమ్ ఇండియాలో కూడా తక్కువ సమయంలోనే ఛాన్స్ దక్కుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రతి ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చి తమ ఆట తీరుతో వెలుగులోకి రావడం చూస్తూ ఉంటాం. ఇక ఐపీఎల్ లో మాత్రం తెలుగు క్రికెటర్లకు పెద్దగా ఛాన్సులు రావు. వచ్చినా కేవలం ఇద్దరూ ముగ్గురు క్రికెటర్లు మాత్రమే సెలెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం.
ఇలాంటి సమయంలో ఎంతో మంది తెలుగు క్రికెటర్లకు నిరాశే ఎదురవుతుంది. అయితే ఇక ఇప్పుడు తెలుగు క్రికెటర్లకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అదింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ జిల్లా మూలపాడు క్రికెట్ స్టేడియంలో రెండో గ్రౌండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక్కడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం అంటూ చెప్పుకోచ్చారు. 175 నియోజకవర్గాలు ఇలా మైదానాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.